(Yanamala) విజయవాడ: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయాయని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని రెండున్నరేండ్లలో అథఃపాతాళానికి తీసెళ్లారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అసమానతలు 43 శాతానికి పెరగడమే ఇక్కడ అభివృద్ధి మందగించిందని చెప్పేందుకు నిదర్శనమన్నారు. ఆర్థిక క్రమశిక్షణను గాలికొదిలేసిన జగన్ ప్రభుత్వం.. అప్పుల ఊబిలోని రాష్ట్రాన్ని నెట్టడంపై చర్చించేందుకు సిద్ధమన్నారు. దీనిపై తక్షణమే గ్రీన్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం 1.4 శాతం క్షీణించిందని, ద్రవ్యోల్బణం ప్రస్తుతం 14.2 శాతానికి పెరిగిందని యనమల వెల్లడించారు. ఉచితాలు, రాయితీలకు మంగళం పాడారని, నిరుపేదలను ముక్కుపిండి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాగే మీ తీరు కొనసాగితే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. చేతిగానితనం, మొండితనంతో రాష్ట్రం ఎంత నష్టపోయిందో జగన్ సమీక్షించుకుంటే చాలన్నారు.
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..