Karikaala | యుద్ధ వీరుడిగా సందీప్ కిషన్.. భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం రెండు పార్టులుగా విడుదల!
Karikaala | యంగ్ హీరో సందీప్ కిషన్ తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన, ఇప్పుడు పీరియాడిక్ యాక్షన్ జానర్లోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ‘కరికాల’ అనే భారీ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
Karikaala | యంగ్ హీరో సందీప్ కిషన్ తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన, ఇప్పుడు పీరియాడిక్ యాక్షన్ జానర్లోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ‘కరికాల’ అనే భారీ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇటీవలి కాలంలో పీరియాడిక్ కథలు, రాజుల చరిత్ర, యుద్ధ నేపథ్యంతో రూపొందుతున్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అదే తరహాలో ఇప్పుడు సందీప్ కిషన్ కూడా ఓ భారీ పీరియాడిక్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
‘శంబాల’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న యుగంధర్ ముని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి, రాజశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో సందీప్ కిషన్ శక్తివంతమైన యోధుడి పాత్రలో కనిపిస్తున్నారు. చేతిలో కత్తి పట్టుకుని గుర్రంపై యుద్ధానికి దూసుకెళ్తున్న ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. పోస్టర్లో ఆయన పక్కనే ఓ సింహం కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యుద్ధభూమి వాతావరణం, భారీ విజువల్స్, పవర్ఫుల్ లుక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. పోస్టర్‌ను బట్టి చూస్తే, ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాకుండా చారిత్రక నేపథ్యంతో కూడిన ఎమోషనల్ సాగా కూడా కావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీలను కూడా అధికారికంగా వెల్లడించారు. ‘కరికాల – చాప్టర్ 1’ : 2027 జూలై 2, ‘కరికాల – చాప్టర్ 2’ : 2027 అక్టోబర్ 28 అంటే కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే రెండు భాగాలను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేయడం విశేషంగా మారింది. ఇప్పటివరకు సందీప్ కిషన్ ఎక్కువగా యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాల్లో కనిపించారు. అయితే ‘కరికాల’ తో తొలిసారి భారీ పీరియాడిక్ యాక్షన్ కథలో నటిస్తున్నారు. పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా శిక్షణ తీసుకునే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘కరికాల’ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. సందీప్ కిషన్ కొత్త అవతారం, భారీ కాన్సెప్ట్, రెండు భాగాల విడుదల ప్రకటనతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.అయితే సినిమా కథ, ఇతర నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. పీరియాడిక్ యాక్షన్ చిత్రాల జోరు కొనసాగుతున్న సమయంలో వస్తున్న ‘కరికాల’ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

