(Minister Balineni) అమరావతి : ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తెర లేవడంతో వాతావరణం వేడివేడిగా మారింది. ఒకరిపై ఒకరు వ్యగ్యాస్త్రాలు విసురుకోవడం, ఆరోపణలు చేసుకోవడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. మిగతా ప్రాంతాల కంటే ముఖ్యంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంపై వైసీపీ కన్నేసింది. కుప్పంలో పాగా వేసేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. కుప్పంలో ఓటు అడిగే నైతిక హక్కు వైసీపీకి లేదని నారా లోకేష్ చెప్పగా… వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రతి విమర్శల దాడికి దిగారు. వీరి వరుసలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కూడా నిలిచారు.
కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకున్నదని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. కుప్పంలో ఎలాగైనా గెలవాలని ఓటుకు రూ.5 వేలు పంపిణీ చేస్తున్నారని, ఇది లోకేష్‌కు సిగ్గుచేటని విమర్శించారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా కుప్పంలో వైసీపీ గెలిచి తీరుతుందన్నారు. టీడీపీ నేతలు ఇది రాసిపెట్టుకోవాలన్నారు. కుప్పం నియోజకవర్గానికి ఏం చేయలేని చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. కుప్పం మున్సిపాలిటీని అభివృద్ధి చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని బాలినేని పేర్కొన్నారు.
చరిత్రలో ఈ రోజు : ఫ్రాన్స్‌లో ఉగ్రవాద దాడులకు ఆరేండ్లు..
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..