Heart Disease and Sleep time : గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
Heart Disease and Sleep time : గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించడానికి, నిద్రకు సంబంధం ఉన్నదంటున్నారు పరిశోధకులు. మన పడుకునే నిద్ర మన గుండె ఆరోగ్యంపై...

(Heart Disease and Sleep time) గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించడానికి, నిద్రకు సంబంధం ఉన్నదంటున్నారు పరిశోధకులు. మన పడుకునే నిద్ర మన గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, అలాగే, స్ట్రోక్ అవకాశాలను కూడా పెంపొందిస్తుందంటున్నారు వారు. ‘గోల్డెన్ అవర్’గా చెప్పుకునే సమయాన్ని నిద్రకు పాటించడం చాలా అవసరమని వారు సూచిస్తున్నారు. వీరి పరిశోధన నివేదిక యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురితమైంది.
ఇంగ్లండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్ పరిశోధకులు తమ తాజా పరిశోధనలో నిద్రకు, గుండె ఆరోగ్యానికి ఉన్న సంబంధాన్ని వివరించారు. అర్ధరాత్రి లేదా చాలా ఆలస్యంగా నిద్రపోతే.. అది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని పరిశోధకులు అంటున్నారు. వీరి పరిశోధన ప్రకారం, త్వరగా నిద్రపోవడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. శరీరంలోని జీవ గడియారం మనల్ని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనిని సిర్కాడియన్ రిథమ్ అంటారు. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల సిర్కాడియన్ రిథమ్ దిగజారుతుంది. దీన్ని మెరుగుపరచాలంటే రాత్రి 10-11 గంటల మధ్య నిద్రపోవాలని పరిశోధకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఆలస్యంగా నిద్రపోయే మహిళలు ఈ సమయాలను పాటించడం చాలా అవసరమని వారు సూచిస్తున్నారు.
జీవ గడియారం వేళలు మారొద్దు..
ఆలస్యంగా నిద్రించే వారు ఉదయం వేళ ఆలస్యంగా మేల్కొంటారు. ఫలితంగా వారిలోని జీవ గడియారం వేళలు మారుతాయి. ఇది గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. రాత్రిపూట త్వరగా నిద్రపోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. 43 నుంచి 74 ఏండ్ల మధ్య ఉన్న 88 వేల మంది బ్రిటీష్ పెద్దలపై వీరు పరిశోధన చేశారు. పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులు ట్రాకర్ ధరించడం ద్వారా వారు నిద్ర పోవడం, మేల్కొనే కార్యాచరణను పర్యవేక్షించారు. దీంతోపాటు వారి జీవనశైలికి సంబంధించిన అంశాలతో బేరీజు వేసుకున్నారు. చివరకు ఆలస్యంగా నిద్రపోయే వారిలో గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు గుర్తించారు. రాత్రి 10-11 గంటల మధ్య నిద్రపోయే వారిలో గుండె జబ్బులు తక్కువగా ఉన్నాయని తేల్చారు. ఇదే సమయంలో, అర్ధరాత్రి తర్వాత నిద్రపోయే వ్యక్తుల్లో ఈ ప్రమాదం 25 శాతం వరకు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

