చరిత్రలో ఈ రోజు : ఫ్రాన్స్‌లో ఉగ్రవాద దాడులకు ఆరేండ్లు..
Today History : ఫ్రాన్స్ ఉగ్రవాదులు దాడులకు తెగబడి నేటికి సరిగ్గా ఆరేండ్లు పూర్తయ్యాయి. ఉగ్రవాదులు ఆరు ప్రాంతాల్లో విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో దాదాపు 130 మంది

Today History : ఫ్రాన్స్ ఉగ్రవాదులు దాడులకు తెగబడి నేటికి సరిగ్గా ఆరేండ్లు పూర్తయ్యాయి. ఉగ్రవాదులు ఆరు ప్రాంతాల్లో విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో దాదాపు 130 మంది అసువులు బాసారు. రాత్రి 9.20 గంటలకు ఫుట్‌బాల్ స్టేడియం బయట తొలి కాల్పుల సంఘటన జరిగింది. అనంతరం మరో ఐదు ప్రాంతాల్లో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో 130 మంది మరణించగా.. దాదాపు 350 మంది గాయపడ్డారు. ఈ దాడుల అనంతరం ఫ్రాన్స్‌లో ఎమర్జెన్సీ విధించారు.
నవంబర్ 13 వ తేదీని ఫ్రాన్స్ మరిచిపోదు. ఉగ్రవాదలు దాడులతో మొత్తం ఫ్రాన్స్ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు నిమిషాల వ్యవధిలో ఆరు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడి దాదాపు 130 మంది ప్రాణాలు తీశారు. ఉగ్రవాదులు ఫుట్‌బాల్ స్టేడియం వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడిన ప్రజలతో పాటు బార్, రెస్టారెంట్, కాన్సర్ట్హాల్ను వదిలిపెట్టలేదు. మొదటి దాడి జరిగిన సమయంలో జర్మనీ, ఫ్రాన్స్ మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్నది. అప్పటి అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే కూడా అక్కడే ఉన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన బేటే కాలన్ కచేరీ హాలులోకి ప్రవేశించిన ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఈ దాడిలో అత్యధికంగా 89 మంది మరణించారు. 2008 నాటి ముంబై దాడిలో అనుసరించిన వ్యూహాన్నే ఈ దాడిలోనూ ఉగ్రవాదులు అనుసరించినట్లుగా తెలుస్తున్నది.
ఈ దాడులకు అదే ఏడాది జనవరిలో చార్లీ హెబ్డో మ్యాగజైన్లో ప్రచురితమైన ప్రవక్త ముహమ్మద్ కార్టూన్ కూడా ఒక కారణమని భావిస్తున్నారు. 2004 మార్చిలో స్పానిష్ రాజధాని మాడ్రిడ్‌లో జరిగిన దాడి తర్వాత ఇదే అత్యంత దారుణమైనదిగా భావిస్తున్నారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
ఇవాళ ప్రపంచ దయ దినోత్సవం
ఇవాళ తెలంగాణ ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు వర్ధంతి
2019: ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం పబ్లిక్ అథారిటీ అని, సమాచార హక్కు చట్టం కిందకు వస్తుందని పేర్కొన్న భారత సుప్రీంకోర్టు
1998 : చైనా నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ దలైలామాను కలుసుకున్న అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్
1985 : కొలంబియాలో అగ్నిపర్వతం పేలిన ఘటనలో 25 వేల మంది దుర్మరణం
1971 : మార్స్ కక్ష్యలోకి ప్రవేశించిన మారినర్-9
ఇవి కూడా చదవండి..
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

