(Venkaiah Naiudu) నెల్లూరు : భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయనకు వెంకటాచలం రైల్వే స్టేషన్లో అధికారులు ఘనంగా స్వాగతించారు. స్వర్ణభారతి ప్రాంగణంలో విశ్రాంతి తీసుకున్న అనంతరం లాయర్ పత్రిక 40 వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాకు చెందిన పలువురు స్నేహితులను ఆప్యాయంగా పలుకరించారు. ఇవాళ దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. దివ్యాంగులతో కలిసి ముఖాముఖిలో పాల్గొన్నారు. నైపుణ్యత ప్రదర్శించిన పలువురు దివ్యాంగులకు బహుమతులు అందజేశారు.
ఇటీవలికాలంలో రాజకీయ నేతల మాటలు రోత కలిగిస్తున్నాయని వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. కొందరిలోనైనా మార్పు కలిగిస్తుందనే భావనతోనే ఈ ‘రోత’ అనే పదాన్ని వాడుతున్నట్లు వివరణ ఇచ్చారు. రాజ్యంగ పదవిలో కన్నా జనంతో కలిసి ఉన్నప్పుడే తనకు ఎక్కువ ఆనందం కలుగుతుందని చెప్పారు. లాయర్ పత్రికను 40 ఏండ్లుగా విజయవంతంగా నడుపుతున్న నిర్వాహకులను వెంకయ్యనాయుడు అభినందించారు. ఆదివారం వెంకయ్యనాయుడు స్వర్ణభారత్ ట్రస్ట్ 20 వ వార్షికోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుంచి నెల్లూరుకు వస్తున్నారు.
చరిత్రలో ఈ రోజు : ఫ్రాన్స్‌లో ఉగ్రవాద దాడులకు ఆరేండ్లు..
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..