ఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ పురుషుల డబుల్స్ జోడీ మానుష్ షా, మానవ్ ఠక్కర్ సింగపూర్ స్మాష్‌లో క్వార్టర్స్ చేరింది. ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ జోడీ.. 3-0 (11-7, 11-5, 11-9)తో బ్రెజిల్‌కు చెందిన టియొడొరొ, లిజుకాను ఓడించింది.
మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మానుష్-దివ్య జంట కూడా 3-0తో కొయెన్,జియాన్ (సింగపూర్)పై గెలిచి క్వార్టర్స్ చేరింది. ఉమెన్స్ సింగిల్స్‌లో మణికా బాత్రా, డబుల్స్ విభాగంలో దివ్య, యశస్విని ద్వయం రౌండ్ ఆఫ్ 16లోనే నిష్క్రమించింది.