సివిల్ సప్లయ్‌లో జీఎండీ పోస్ట్!
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థలో మరో కొత్త పోస్టును క్రియేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా విశ్వసనీయ సమాచారం. ఎండీకి తోడుగా జీఎండీ(జాయింట్ ఎండీ) పోస్టును ఏర్పాటుచేస్తున్నట్టు తెలిసింది.
- కొత్తగా క్రియేట్ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయం
- ఎఫ్‌సీఐలో రిటైర్డ్ కానున్న అధికారి కోసమేనని చర్చ
- ఎండీ వర్సెస్ జీఎండీగా మారే ప్రమాదం
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పౌరసరఫరాల సంస్థలో మరో కొత్త పోస్టును క్రియేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా విశ్వసనీయ సమాచారం. ఎండీకి తోడుగా జీఎండీ(జాయింట్ ఎండీ) పోస్టును ఏర్పాటుచేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్టుగా తెలుస్తున్నది. అయితే, ఇప్పుడు ఈ కొత్త పోస్ట్ ఎందుకనే చర్చ జరుగుతున్నది. ఇప్పటికే ఎండీ కాకుండా డైరెక్టర్‌తోపాటు అడిషనల్ డైరెక్టర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ రెండింటిలోనూ ఐఏఎస్ అధికారులున్నారు. ఇవి కాకుండా మరో కొత్త పోస్టు క్రియేట్ చేయాలనే నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ పోస్టును ప్రత్యేకంగా ఓ అధికారి కోసం క్రియేట్ చేస్తున్నట్టు సమాచారం.
ఎఫ్‌సీఐలో పనిచేస్తున్న సదరు అధికారి త్వరలోనే ఉద్యోగ విరమణ చేయనుండటంతో, ఆ అధికారిని సివిల్‌సప్లయ్ కార్పొరేషన్లోకి తీసుకునేందుకు వీలుగా జీఎండీ పోస్టును క్రియేట్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఎఫ్‌సీఐలో పని చేసిన అధికారి, సివిల్ సప్లయ్‌లో ఉండడంతో కేంద్రంతో సంప్రదింపులకు మార్గం సులువుగా ఉంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. జీఎండీ పోస్టు క్రియేషన్‌తో ఎండీ వర్సెస్ జీఎండీగా మారే ప్రమాదం కూడా లేకపోలేదనే చర్చ సివిల్ సప్లయ్ వర్గాల్లో జరుగుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

