న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వివాదాస్పద ఔట్‌పై వెస్టిండీస్ వెటరన్ అంపైర్ స్టీవ్ బక్నర్ ఇన్నాళ్లకు స్పందించాడు. సరిగ్గా 22 ఏండ్ల క్రితం 2003-04లో గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా గిలెస్సీ బౌలింగ్‌లో సచిన్‌ను బక్నర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. అప్పట్లోనే తీవ్ర వివాదానికి కారణమైన ఔట్‌పై బక్నర్ తాజాగా తన వివరణ ఇచ్చాడు.
వెస్టిండీస్ క్రికెట్ అంపైర్స్ అసోసియేషన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బక్నర్ మాట్లాడుతూ ‘ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో సచిన్ ఎల్బీడబ్ల్యూ ఔట్ విషయంలో తప్పు జరిగింది. అది జరిగి ఇన్నేండ్లు అవుతున్నా.. ఇప్పటికీ దాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు.
అతని ఔట్ ఇవ్వడం అలా జరిగిపోయింది. జీవితంలో తప్పులు జరుగుతుంటాయి. తప్పును నేను ఒప్పుకుంటున్నాను, జీవితం అనేది సాగుతూనే ఉంటుంది. ఇప్పటికీ ఆ విషయంలో పశ్చాత్తాప పడుతున్నాను’ అని అన్నాడు. గిలెస్పీ బౌలింగ్‌లో బంతి వికెట్ల పైనుంచి వెళుతున్నట్లు రిప్లేలో స్పష్టంగా కనిపించడంపై అప్పట్లో పలువురు మాజీ క్రికెటర్లు బక్నర్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.