శ్రీకాకుళం : (Dharmana) రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం జగన్ నడుం బిగించడం శుభసూచకమని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. వివాదాల కారణంగా రెండు రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులు అసంపూర్తిగా నిలిచిపోయాయని, ఈ సమస్యల పరిష్కారానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా జగన్ పాలన కొనసాగుతున్నదని ప్రశంసించారు.
ఒడిశా-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదలతో పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయని, వీటి కోసం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో జగన్ మాట్లాడాలని నిర్ణయించుకోవడం హర్షణీయమని ధర్మాన ప్రసాదరావు అన్నారు. సీఎం జగన్ నిర్ణయాన్ని మా జిల్లా రైతులు స్వాగతిస్తున్నారని చెప్పారు. జగన్ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుందని, సిక్కోలు వాసుల చిరకాల స్వప్నం నెరవేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను పరిష్కరించుకునేందుకు ఎల్లుండి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో జగన్ భేటీ అవనున్నారు. సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలను శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేగా స్వాగతిస్తున్నానని, ఇది వెనకబడిన జిల్లాను అభివృద్ధిలోకి తీసుకువస్తుందని అభిప్రాయపడుతున్నట్లు ధర్మాన ప్రసాదరావు చెప్పారు.
వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహాన్నివ్వాలి: వెంకయ్యనాయుడు
పాపికొండలకు పద పద పద.. బోట్ యాత్ర షురూ!
చెరువులో స్నానానికి దిగిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి
సంక్రాంతికి ముందే జోరుగా కోడిపందేలు.. 32 మంది అరెస్ట్, 60 కోడిపుంజులు స్వాధీనం
తల్లి మరణవార్త విని కన్నుమూసిన ఏఎస్సై.. పెండ్లింట విషాదం
ఠారెత్తిస్తున్న టమాట.. రికార్డు స్థాయిలో 74 పలుకుతున్న ధర
ప్రభంజనంలా కొనసాగుతున్న రైతుల మహా పాదయాత్ర
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..