Venkaiah Naidu : వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహాన్నివ్వాలి: వెంకయ్యనాయుడు
Venkaiah Naidu : గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు వ్యవసాయాధారిత..

చంపారన్ (బిహార్) : (Venkaiah Naidu) గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కరోనా అనంతర పరిస్థితుల్లో గ్రామాలకు యువత వలసబాట పడుతున్న అంశాన్ని ప్రస్తావిస్తూ.. వ్యవసాయ రంగంలో పరిశ్రమల ద్వారానే మన దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకెళ్లేందుకు వీలవుతుందని చెప్పారు. బిహార్ చంపారన్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవానికి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పట్టాలను బహూకరించారు.
రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్‌పీఓ) వంటివి చిన్న, మధ్యతరగతి రైతులకు ఎంతగానో ఉపయుక్తం అవుతాయని, అందుకే ఎఫ్పీఓల సామర్థ్య నిర్మాణం అవసరమని.. ఈ దిశగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు.
వ్యవసాయంతోపాటు ఆహారోత్పత్తుల నిర్వహణ తదితర అంశాల్లో సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ఆహారభద్రతను సుస్థిరం చేసే దిశగా మరో అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. స్నాతకోత్సవంలో పాల్గొన్న విద్యార్థులందరూ తమ భవిష్యత్తులో ఉన్నతస్థానాలకు చేరుకోవాలని ఉపరాష్ట్రపతి శుభాశీస్సులు అందజేశారు. చంపారన్‌లో రైతు కేంద్రిత సంస్థల ఏర్పాటులో చొరవతీసుకున్న పార్లమెంటు సభ్యుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి రాధామోహన్ సింగ్‌ను ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ కార్యక్రమంలో బిహార్ గవర్నర్ ఫగు చౌహాన్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బిహార్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అమరేంద్ర సింగ్‌తోపాటు, విశ్వవిద్యాలయ కులపతి డాక్టర్ ప్రఫుల్ల్ కుమార్, ఇతర అధికారులు, బోధనాసిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అంతకుముందు నలంద విశ్వవిద్యాలయంలో జరిగిన 6వ అంతర్జాతీయ ధర్మ-ధమ్మ సదస్సును ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నలంద విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ సునయన సింగ్, ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్లు శ్రీమతి లలిత కుమారమంగళం, ధృవ్ కటోచ్తో పాటు హిందు, బౌద్ధ ధర్మాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సదస్సుకు గుర్తుగా వెంకయ్యనాయుడు ఒక మొక్కను నాటారు.
ఇవి కూడా చదవండి..
పాపికొండలకు పద పద పద.. బోట్ యాత్ర షురూ!
చెరువులో స్నానానికి దిగిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి
సంక్రాంతికి ముందే జోరుగా కోడిపందేలు.. 32 మంది అరెస్ట్, 60 కోడిపుంజులు స్వాధీనం
తల్లి మరణవార్త విని కన్నుమూసిన ఏఎస్సై.. పెండ్లింట విషాదం
ఠారెత్తిస్తున్న టమాట.. రికార్డు స్థాయిలో 74 పలుకుతున్న ధర
ప్రభంజనంలా కొనసాగుతున్న రైతుల మహా పాదయాత్ర
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

