ASI Died : తల్లి మరణవార్త విని కన్నుమూసిన ఏఎస్సై.. పెండ్లింట విషాదం
ASI Died : పెళ్లింట విషాదం నెలకొన్నది. తల్లి చనిపోయిన వార్త విని తట్టుకోలేని ఆమె కొడుకు కూడా ప్రాణాలు విడిచాడు. ఈ విషాదకర సంఘటన ...

అనంతపురం : (ASI Died) పెళ్లింట విషాదం నెలకొన్నది. తల్లి చనిపోయిన వార్త విని తట్టుకోలేని ఆమె కొడుకు కూడా ప్రాణాలు విడిచాడు. ఈ విషాదకర సంఘటన అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం పరిధిలో జరిగింది. అప్పటిదాకా పెండ్లికొచ్చిన బంధువులతో సంతోషంగా గడిపిన ఆ కుటుంబం వారిద్దరి మృతితో శోకసంద్రంలో మునిగిపోయింది.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం పరిధిలోని కొర్రపాడు గ్రామానికి చెందిన వెంకటస్వామి (56) పామిడి పోలీసుస్టేషన్లో ఏఎస్సైగా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. శనివారం కుమారుడు గోవర్ధన్ వివాహం జరిపించారు. ఇలాఉండగా, వరుడి నాయనమ్మ అయిన వెంకటస్వామి తల్లి కోన్నమ్మ (70) అనారోగ్యంతో అనంతపురంలోని ఓ వైద్యశాలలో చేరి చికిత్స పొందుతున్నది. పెండ్లయి కొద్ది సేపటికే ఆమె కన్నుమూసింది. తల్లి మరణ వార్త విన్న కుమారుడూ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతన్ని దగ్గర్లోని దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
ఠారెత్తిస్తున్న టమాట.. రికార్డు స్థాయిలో 74 పలుకుతున్న ధర
ప్రభంజనంలా కొనసాగుతున్న రైతుల మహా పాదయాత్ర
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
జింక్‌తో జలుబు, దగ్గుకు చెక్ పెట్టొచ్చు..! వెస్ట్రన్ వర్శిటీ పరిశోధన
వాయు కాలుష్యంతో జాగ్రత్త.. గుండెను బలహీనపరుస్తుందని హెచ్చరిక
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి
Obesity | 2050 నాటికి ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ఊబకాయం.. చర్యలు తప్పనిసరి అంటున్న సంస్థలు..
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

