(Oxygen Plant) విశాఖపట్నం: కరోనా వైరస్‌కు గురైన వారికి సేవలందించేందుకు రైల్వే శాఖ మరింత సమాయత్తం అవుతున్నది. అందులో భాగంగా పలు ప్రాంతాల్లోని రైల్వే దవాఖానల్లో ఆక్సిజన్ ప్లాంటులను ఏర్పాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీనిలో విశాఖ డివిజనల్ అధికారులు ముందున్నారు.
విశాఖపట్నం డివిజనల్ రైల్వే దవాఖానలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ అనుప్ సత్పతి ప్రారంభించారు. ఈ ప్లాంట్ నుంచి నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయవచ్చు. ఈ ప్లాంట్ కరోనాతోపాటు ఆక్సిజన్ సప్లిమెంట్ అవసరమయ్యే ఇతర రోగుల అవసరాలను కూడా తీర్చనున్నది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధించిందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుస్తుగా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు అనుప్ సత్పతి తెలిపారు. టెక్ మహీంద్రా ఆర్థిక సాయంతో ఈ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ ఎంకే రామకృష్ణ, టెక్ మహీంద్రా వైస్ ప్రెసిడెంట్, ప్రాక్టీస్ లీడర్ రాజేష్ దుద్దు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..