వేములపల్లి, ఫిబ్రవరి 21 : యూరియా అవస్థలు తాళలేక రైతులు నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై భైఠాయించి ధర్నా చేశారు. నల్లగొండ జిల్లా వేములపల్లి సొసైటీ దగ్గర రైతులకు యూరియా దొరకక ఇబ్బందులు పడి ఆన్లైన్లోనూ యూరియా బుక్ కాక అవస్థలు పడుతున్నారు. దీంతో ఓపిక నశించి రోడ్డుపైకి ఎక్కి రైతులు ధర్నాకు ఉపక్రమించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ రైతులకు సకాలంలో యూరియా అందించాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో రహదారికి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

యూరియా కోసం రహదారిపై రైతుల ధర్నా