(MLC Madhav) విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నీరుగార్చివేసిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. జగన్ అనాలోచిత విధానాల కారణంగానే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పాలనా తీరును ఎండగడుతూ ఈ నెల 28 న ‘ప్రజాగ్రహ సభ’ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభకు కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని ఆయన చెప్పారు.
ఏపీలో జగన్ ప్రభుత్వ వైఖరి కారణంగా పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని మాధవ్ ఆరోపించారు. రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని, ఈ ఘనత కేవలం జగన్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. సినిమా రంగంలో ప్రభుత్వం ఎక్కువ జోక్యం చేసుకుంటున్నదని, ఫలితంగా సినిమా పరిశ్రమ నష్టాల పాలయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల వందలాది సినిమా థియేటర్లు మూతపడ్డాయని గుర్తుచేశారు. ప్రభుత్వం కొన్ని థియేటర్లనే ఎందుకు టార్గెట్ చేస్తుందో అర్థం కావడంలేదన్నారు.
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..