(Jagan Review) అమరావతి: రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష జరిపారు. సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో జగన్ సమావేశమయ్యారు. ఇదే సందర్భంగా కొత్త సంవత్సరం వేడుకల గురించి కూడా చర్చించినట్లు తెలుస్తున్నది. వైద్యారోగ్య శాఖలో సాధారణ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఫిబ్రవరి కల్లా ప్రతి దవాఖానలో సరిపడా సిబ్బంది ఉండేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు తెలుస్తున్నది. ఇందుకోసం కొత్త రిక్రూట్మెంట్లను కూడా పూర్తిచేయాలని ఆదేశించినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది.
రాష్ట్రంలో ఒమిక్రాన్ విస్తరిస్తుండటంతో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నట్లు ఆయా వర్గాలు తెలిపాయి. ఈ సమీక్షకు మంత్రి ఆళ్ల నానితోపాటు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..