(Gas Tanker) విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లోని పరవాడ వద్ద ఎల్పీజీ గ్యాస్ తీసుకెళ్తున్న ట్యాంకర్ బోల్తా కొట్టింది. ప్రమాదంలో ట్యాంకర్‌కు మంటలు అంటకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. గ్యాస్ లీక్ అరికట్టేందుకు అధికారులు హై అలర్ట్ ప్రకటించి నివారణ చర్యలు తీసుకుంటున్నారు. బాట్లింగ్ కంపెనీ నుంచి గ్యాస్ నింపుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ట్యాంకర్ బోల్తా పడిన వార్త తెలియగానే అధికారులు వేగంగా స్పందించి గ్యాస్ లీక్ కాకుండా చర్యలు చేపట్టారు. దాంతో అధికారులతో పాటు స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఒకవేళ మంటలు అంటుకుని ఉంటే ఎలాంటి పరిణామాలు తలెత్తేవే అంటూ స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
బోల్తాకొట్టిన ట్యాంకర్‌ను పోలీసులు క్రేన్ సాయంతో పైకి ఎత్తారు. అయితే, ట్యాంకర్‌ను లిఫ్ట్ చేసే ప్రయత్నంలో ట్యాంకర్‌కు రంధ్రం ఏర్పడి గ్యాస్ లీక్ అయింది. అగ్నిప్రమాదానికి దారితీయకుండా అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైరింజన్లతో నీటిని చిమ్ముతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది పడకుండా ఉండేందుకు పరిసరాల ప్రజలను దూరంగా తరలించారు. పక్కనే ఉన్న పలు కంపెనీల యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. ట్యాంకర్ నుంచి గ్యాస్ బయటకు విరజిమ్ముతున్నది. నిపుణుల బృందం సంఘటన స్థలానికి చేరుకుని గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నది.
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..