(Century Plyboards) కడప: బద్వేల్ పట్టణంలో సెంచరీ ప్లైబోర్డ్స్ పరిశ్రమ ఏర్పాటు కానున్నది. తొలుత ఈ పరిశ్రమను చెన్నైలో ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే, జగన్ సూచనలతో ఇక్కడి మార్చారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్మోహన్రెడ్డి.. గురువారం మధ్యాహ్నం బద్వేల్లో సెంచరీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. అలాగే, రూ.9,556 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. బద్వేల్ వంటి వెనుకబడిన ప్రాంతంలో ప్లైబోర్డ్స్ పరిశ్రమను ఏర్పాటు చేయడం పట్ల జగన్ హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక విధానం తమను ఎంతగానో ఆకట్టుకున్నదని సెంచరీ ప్లైబోర్డ్స్ చైర్మన్ సజ్జన్ భజనకా చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. యూకలిప్టస్ రైతులు ఈ ప్లాంట్ ద్వారా ఎంతో ప్రయోజనం పొందనున్నారు. స్థానిక యువతకు కూడా కొంత మేర ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..