Tirumala | తిరుమల ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం తిరుమల కొండపైకి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు టైర్ ఆకస్మికంగా ఊడిపోయింది. డ్రైవర్ చాకచక్యంగా బస్సును నిలిపివేయడంతో భక్తులంతా ఊపిరిపీల్చుకున్నారు.
మంగళవారం సాయంత్రం సప్తగిరి ఎక్స్ప్రెస్ ప్రయాణికులతో తిరుమల నుంచి తిరుపతికి బయల్దేరింది. ఈ క్రమంలో 57వ మలుపు వద్దకు రాగానే బస్సు ముందు చక్రం ఊడిపోయింది. దీంతో బస్సు ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. వేగం తక్కువగా ఉండటంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును వెంటనే నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. భక్తులెవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి తీసుకున్నారు. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో తిరుపతికి తీసుకెళ్లారు.
Follow Us : on Facebook, Twitter
Bhumana Karunakar Reddy | ఆమె అవినీతి అనకొండ.. ఐఏఎస్ శ్రీలక్ష్మీపై భూమన పరోక్ష విమర్శలు!
IAS Srilakshmi | ఐఏఎస్ శ్రీలక్ష్మి ఎవరి వల్ల జైలుకెళ్లిందో గుర్తులేదా.. భూమనపై బీజేపీ నేత ఫైర్
High Court | జగన్ అక్రమాస్తుల కేసులో వాన్పిక్ కంపెనీకి ఎదురుదెబ్బ.. ఆ పిటిషన్ కొట్టివేత!