Bhumana Karunakar Reddy | ఆమె అవినీతి అనకొండ.. ఐఏఎస్ శ్రీలక్ష్మీపై భూమన పరోక్ష విమర్శలు!
Bhumana Karunakar Reddy | సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుపతి టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఆమె పాత్ర ఉందని తెలిపారు. ఈ కుంభకోణానికి అవినీతిలో అనకొండలాంటి అధికారిణే కారణమని ఆరోపించారు
Bhumana Karunakar Reddy | సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుపతి టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఆమె పాత్ర ఉందని తెలిపారు. ఈ కుంభకోణానికి అవినీతిలో అనకొండలాంటి అధికారిణే కారణమని ఆరోపించారు.
ఆ ఐఏఎస్ అధికారిణి గతంలో మంత్రులను కూడా పూచికపుల్లల్లా చూసిందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తన శాఖకు సంబంధించిన మంత్రులను లెక్క కూడా చేయలేదని తెలిపారు. డబ్బు సంపాదనే తప్ప.. ఏ నైతిక విలువ లేని మనిషి అని మండిపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఓ తాటకిలా కింది అధికారుల పట్ల ఆమె వ్యవహరించేవారని విమర్శించారు.
తిరుపతిలో రోడ్లు వేస్తున్న సమయంలో టీడీఆర్ బాండ్ల ద్వారా వందల కోట్లు దోచుకోవాలని ఆ అధికారిణి ప్రయత్నించిందని భూమన ఆరోపించారు. అప్పుడు ఆ అవినీతిని అడ్డుకున్నామని తెలిపారు. దీంతో ఇది తట్టుకోలేకనే నెల్లూరు జిల్లా రైతుకు సమాచారం లీక్ చేసి.. రూ. రెండు వేల కోట్లు దోచుకున్నారంటూ ప్రచారం చేయించిందని పేర్కొన్నారు. ఒక్క రూపాయి కూడా తాము అవినీతి చేయలేదని.. అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే ఏ శిక్షకైనా రెడీ అని ప్రకటించారు. టీడీఆర్ బాండ్ల విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు.
ఆ ఐఏఎస్ అధికారిణి 35 ఏండ్లలోనే రూ.వందల కోట్లు లూటీ చేసిందని భూమన ఆరోపించారు. రోజూ లక్షన్నర చీర కట్టే ఆ అవినీతి అధికారిణి జీతమెంత అని ప్రశ్నించారు. ఆమె దగ్గర వేల రూపాయల విలువ చేసే 11 విగ్గులు ఉన్నాయని చెప్పారు. నీతిగా నిజాయితీగా ఉండే తనపై కక్షగట్టి అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 21 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి తిరుపతిని అభివృద్ధి చేశామని తెలిపారు.
IAS శ్రీలక్ష్మిపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆమె కట్టే చీర ఖరీదు ఎంత? ఆమెకు వచ్చే జీతం ఎంత?
TDR బండ్ల స్కాంలో శ్రీలక్ష్మి పాత్ర ఉంది
టీడీపీ నేతలతో కలిసి రూ.వందల కోట్లు దోచుకున్నారు
ఆమె ఒక అవినీతి అనకొండ
అవినీతితో వేల కోట్లు లూటీ చేసింది… pic.twitter.com/jsqZBxLtQv
— BIG TV Breaking News (@bigtvtelugu) August 26, 2025
Follow Us : on Facebook, Twitter
Read More :
High Court | జగన్ అక్రమాస్తుల కేసులో వాన్‌పిక్ కంపెనీకి ఎదురుదెబ్బ.. ఆ పిటిషన్ కొట్టివేత!
PV Sunil Kumar | సీఐడీ మాజీ చీఫ్ సస్పెన్షన్ మరో 6 నెలలు పొడిగింపు
Vijayawada | భక్తులకు అలర్ట్.. విజయవాడ దుర్గగుడిలో కొత్త రూల్!
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

