Vijayawada | విజయవాడకు వెళ్లే కనకదుర్గమ్మ భక్తులకు అలర్ట్! ఇకపై ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు కొత్తగా డ్రెస్ కోడ్ అమలు చేయనున్నారు. దుర్గ గుడికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులే ధరించాలి. లేకపోతే వారిని ఆలయంలోకి అనుమతించబోరు. ఈ మేరకు ఆలయ ఈవో వీకే శీనా నాయక్ అధికార ప్రకటన చేశారు. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి వస్తుందని తెలిపారు.
దుర్గ గుడికి భక్తులు అభ్యంతరక దుస్తుల్లో వస్తుండటంతో పాటు, ఆలయ లోపల వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఘటనలను ఇటీవల గుర్తించామని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ సంప్రదాయాలకు భంగం కలగకుండా ఉండేదుకు కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అలాగే ఆలయంలో సెల్ఫోన్ వాడకాన్ని కూడా నిషేధిం విధించామని వెల్లడించారు. ప్రొటోకాల్ దర్శనాలకు వచ్చే వారు ఆలయ ఆఫీసుల్లోనే ఫోన్లు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని సూచించారు.
సెప్టెంబర్ 27వ తేదీ నుంచి భక్తులతో పాటు ఆలయ సిబ్బంది సంప్రదాయ దుస్తులు ధరించడం తప్పనిసరి కానుంది. విదుల్లో ఉన్న సమయంలో ఆలయ ఉద్యోగులు కచ్చితంగా ఐడీ కార్డులు ధరించాలని, అలాగే స్కానింగ్ పాయింట్, టికెట్ కౌంటర్ వద్ద కఠిన తనిఖీలు చేయాలని సూచించారు. దుర్గ గుడిలో సేవ, దర్శనాలతో పాటు వసతి సదుపాయాల కోసం https://kanakadurgamma.org/en-in/home వెబ్సైట్ సందర్శించాలని ఆలయ అధికారులు సూచించారు.
Follow Us : on Facebook, Twitter
Srisailam | ఆ మూడు భవనాలు ఖాళీ చేయండి.. శ్రీశైలం దేవస్థానం రిక్వెస్ట్..
Free Current | గణేశ్ మండపాలకు ఫ్రీ కరెంట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Government Job | ఒకే ఇంట్లో నలుగురు అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు