Free Current | వినాయక చవితి సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గణేశ్ ఉత్సవ మండపాలకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించారు.
వినాయక మండపాలకు ఉచిత కరెంట్ అందజేయాలని ఉత్సవ సమితులు, మండపాల నిర్వాహకులు ఇటీవల మంత్రి నారా లోకేశ్‌ను విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన నారా లోకేశ్.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, విద్యుత్ వాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో చర్చించారు ఈ సందర్భంగా ఉచిత విద్యుత్ ఇ చ్చేందుకు వారు అంగీకరించారు. ఈ మేరకు ఉచిత విద్యుత్‌కు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేయనున్నట్లు నారా లోకేశ్ తెలిపారు.
గణేశ్ మండపాలకే కాకుండా రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు దుర్గామాత పందిళ్లకు కూడా ఉచిత విద్యుత్ అందజేస్తామని నారా లోకేశ్ తెలిపారు. వినాయక చవితి, దసరా ఉత్సవాలకు సంబంధించి మండపాలకు ఉచిత విద్యుత్ అందజేసేందుకు రూ.25 కోట్లను కూటమి ప్రభుత్వం వెచ్చించనుందని పేర్కొన్నారు. ఇదిలాఉంటే తెలంగాణలో కూడా గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందజేయాలని నిర్ణయించారు.
Follow Us : on Facebook, Twitter
Government Job | ఒకే ఇంట్లో నలుగురు అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు
Hyderabad Drugs Party | హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ.. రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ అరెస్టు
Ambati Rambabu | అంబటి రాంబాబుకు ఆస్కార్ ఇవ్వొచ్చు.. మంత్రి నిమ్మల సెటైర్లు
Raghurama Krishna Raju | ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట