Raghurama Krishna Raju | ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎంపీగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లో ఆయనపై దాఖలైన కేసును కొట్టివేసింది.
ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ బాషాపై దాడి చేశారని రఘురామ కృష్ణరాజుతో పాటు ఆయన కుమారుడు భరత్, కార్యాలయ సిబ్బందిపై గతంలో ఎఫ్ఐఆర్ దాఖలైంది. అయితే ఈ కేసును కొనసాగించాలని అనుకోవడం లేదంటూ కానిస్టేబుల్ బాషా ఇటీవల సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ జేకే మహేశ్వరి ధర్మాసనం.. రఘురామపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.