Ambati Rambabu | పోలవం ప్రాజెక్టుపై చర్చకు సిద్దమా అని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన సవాలుపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. అంబటి రాంబాబు ఇలాంటి సవాలు విసరడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి నిమ్మల రామానాయుడు లబ్ధిదారులు అందజేశారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ.. అబద్ధాలు అతికినట్లు చెప్పడంలో అంబటి రాంబాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. పోలవరం పూర్తి చేయకుండా ఆయన చేతులెత్తేశారని విమర్శించారు. ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబుకు పోలవరం గురించి అర్థం కాలేదని అన్నారు. టీడీపీ పార్టీ దిగువ శ్రేణి నేతలకు ఉన్న అవగాహన కూడా అంబటికి లేదని విమర్శించారు. గత ప్రభుత్వం పాపం వల్లే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని ఆరోపించారు. తమ ఉనికిని కాపాడుకునేందుకే వైసీపీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు.
కాగా, పోలవరం ఈ దుస్థితికి పడిపోవడానికి కారణం చంద్రబాబే అని అంబటి రాంబాబు నిన్న విమర్శించారు. పోలవరం నిర్లక్ష్యానికి, జాప్యానికి కూడా చంద్రబాబే కారణమని ఆరోపించారు. పోలవరం పూర్తవుతుందా? లేదా అన్న భావన ఏపీ ప్రజలకు కలుగుతుందని తెలిపారు. ఈ పాపానికి చంద్రబాబు అసమర్థతే కారణమని మండిపడ్డారు. ఇది వాస్తవం కాదని ఎవరైనా అంటే వారితో చర్చకు సిద్ధమని ఆయన సవాలు విసిరారు. జగన్ ప్రభుత్వం వల్ల పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని చంద్రబాబు అంటున్నాడని మండిపడ్డారు. వాస్తవానికి నది డైవర్ట్ అయిన తర్వాత డయాఫ్రం వాల్ నిర్మాణం చేయాలని.. కానీ కాపర్ డ్యామ్లు పూర్తయి, స్పిల్వే పూర్తయిన తర్వాత వరద వస్తే.. ఆ వరద నీరు అంతా స్పిల్ వే ద్వారా డైవర్ట్ అయిన తర్వాత కాపర్ డ్యామ్ వేయాల్సి ఉంటుందని తెలిపారు. కానీ స్పిల్ వే, కాపర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రం వాల్ వేసి వెళ్లిపోయారని అన్నారు.
Follow Us : on Facebook, Twitter
AP DSC | మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా.. కారణం ఏంటంటే?
Ambati Rambabu | చంద్రబాబులో భయం మొదలైంది.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
Tirupati | తిరుపతి వెళ్లే విమానంలో సాంకేతిక లోపం.. మూడుసార్లు టేకాఫ్ అయ్యి.. రన్వేపైకే రిటర్న్!