IAS Srilakshmi | ఐఏఎస్ శ్రీలక్ష్మీని అవినీతి అనకొండ అంటూ పరోక్షంగా వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మహిళపై ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని మండిపడ్డారు. ఐఏఎస్ శ్రీలక్ష్మి ఎవరి వల్ల జైలుకు వెళ్లిందో తెలియదా అని ప్రశ్నించారు.
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు రాజకీయ నిరుద్యోగిగా మారారని భానుప్రకాశ్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత నుంచి ఆయన మానసిక పరిస్థితి సరిగ్గా లేనట్లు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఓ మహిళా అధికారిణి పై ఇలాంటి భాషలో మాట్లాడటం సరికాదని హితవు పలికారు. అసలు ఆమె ఎవరి కారణంగా జైలుకు వెళ్లాల్సి వచ్చిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే శ్రీలక్ష్మీ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించారని గుర్తుచేశారు. టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్నది నిజం కాదా అని ప్రశ్నించారు.
ఐఏఎస్ శ్రీలక్ష్మిపై భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన భానుప్రకాష్ రెడ్డి
మహిళపై ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా?
ఐఏఎస్ శ్రీలక్ష్మి ఎవరి వల్ల జైలుకు వెళ్లిందో తెలియదా?
TDR బాండ్స్ లో అక్రమాలు జరిగింది వాస్తవం కాదా?
మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదు… https://t.co/1DLyNAi2Gb pic.twitter.com/9L7QscsaZB
— ChotaNews App (@ChotaNewsApp) August 26, 2025
అవినీతిలో అనుకొండ అయిన ఓ అధికారిణి గతంలో మంత్రులను కూడా పూచికపుల్లల్లా చూసిందని ఐఏఎస్ శ్రీలక్ష్మిని ఉద్దేశించి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తన శాఖకు సంబంధించిన మంత్రులను లెక్క కూడా చేయలేదని తెలిపారు. డబ్బు సంపాదనే తప్ప.. ఏ నైతిక విలువ లేని మనిషి అని మండిపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఓ తాటకిలా కింది అధికారుల పట్ల ఆమె వ్యవహరించేవారని విమర్శించారు.
తిరుపతిలో రోడ్లు వేస్తున్న సమయంలో టీడీఆర్ బాండ్ల ద్వారా వందల కోట్లు దోచుకోవాలని ఆ అధికారిణి ప్రయత్నించిందని భూమన ఆరోపించారు. అప్పుడు ఆ అవినీతిని అడ్డుకున్నామని తెలిపారు. దీంతో ఇది తట్టుకోలేకనే నెల్లూరు జిల్లా రైతుకు సమాచారం లీక్ చేసి.. రూ. రెండు వేల కోట్లు దోచుకున్నారంటూ ప్రచారం చేయించిందని పేర్కొన్నారు. ఒక్క రూపాయి కూడా తాము అవినీతి చేయలేదని.. అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే ఏ శిక్షకైనా రెడీ అని ప్రకటించారు. టీడీఆర్ బాండ్ల విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు.
ఆ ఐఏఎస్ అధికారిణి 35 ఏండ్లలోనే రూ.వందల కోట్లు లూటీ చేసిందని భూమన ఆరోపించారు. రోజూ లక్షన్నర చీర కట్టే ఆ అవినీతి అధికారిణి జీతమెంత అని ప్రశ్నించారు. ఆమె దగ్గర వేల రూపాయల విలువ చేసే 11 విగ్గులు ఉన్నాయని చెప్పారు. నీతిగా నిజాయితీగా ఉండే తనపై కక్షగట్టి అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 21 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి తిరుపతిని అభివృద్ధి చేశామని తెలిపారు.
IAS శ్రీలక్ష్మిపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆమె కట్టే చీర ఖరీదు ఎంత? ఆమెకు వచ్చే జీతం ఎంత?
TDR బండ్ల స్కాంలో శ్రీలక్ష్మి పాత్ర ఉంది
టీడీపీ నేతలతో కలిసి రూ.వందల కోట్లు దోచుకున్నారు
ఆమె ఒక అవినీతి అనకొండ
అవినీతితో వేల కోట్లు లూటీ చేసింది… pic.twitter.com/jsqZBxLtQv
— BIG TV Breaking News (@bigtvtelugu) August 26, 2025
Follow Us : on Facebook, Twitter
High Court | జగన్ అక్రమాస్తుల కేసులో వాన్పిక్ కంపెనీకి ఎదురుదెబ్బ.. ఆ పిటిషన్ కొట్టివేత!
PV Sunil Kumar | సీఐడీ మాజీ చీఫ్ సస్పెన్షన్ మరో 6 నెలలు పొడిగింపు
Vijayawada | భక్తులకు అలర్ట్.. విజయవాడ దుర్గగుడిలో కొత్త రూల్!