అమరావతి : ఓటీఎస్‌పై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఓటీఎస్‌తో పేదల మెడకు ఉరి వేస్తున్నారని చంద్రబాబు ఆరోపించగా.. ఓటీఎస్‌పై చంద్రబాబు రాద్ధాంతం అవసరం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ సర్కార్ పై చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. ఓటీఎస్ పేరుతో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం పేదల మెడకు ఉరి వేస్తున్నదని ఆరోపించారు. ఎన్టీఆర్ కట్టించిన ఇళ్లకి ఇప్పుడు డబ్బులు వసూలు చేయడమేంటి? అని చంద్రబాబు నిలదీశారు. కంపల్సరీ కాదంటూనే ఓటీఎస్ కోసం ఒత్తిడి చేస్తున్నారని… బలవంతంగా ఓటీఎస్ పేరుతో సొమ్ము వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా బలవంతంగా వసూళ్లు చేస్తున్నారని విమర్శలు చేస్తుంటే కేసులు పెడతారా..? అని నిలదీశారు. బొబ్బిలిలోని ఓటీఎస్ బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని, ఆ బాలుడికి వైద్య ఖర్చులు టీడీపీ భరిస్తుందని హామీ ఇచ్చారు.
కాగా, వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు మాటలకు కౌంటర్ ఇచ్చారు. ఓటీఎస్‌పై చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటీఎస్ విషయంలో ఎవర్ని ఎవరూ బలవంతపెట్టడం లేదన్నారు. చంద్రబాబు విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు. చంద్రాబు వడ్డీ మాఫీ చేసిన రోజు కూడా పేదలకు ఇల్లు సొంతం కాలేదని, కానీ నేడు రిజిస్ట్రేషన్ భారం లేకుండా ప్రజలకు సంపూర్ణ హక్కు దక్కుతుందని పేర్కొన్నారు. ఈ పథకం వల్ల పెద్దగా ఆదాయం వచ్చేది ఏమీ లేదని, ఇంత సౌలభ్యం ఉన్న పథకంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 30 లక్షల మందికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సొంతంగా ఇళ్లు కట్టిస్తోందని సజ్జల పేర్కొన్నారు. ఓటీఎస్ అంటూ మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబు.. తాను అధికారంలో ఉన్నప్పుడు పేదల ఇండ్ల నిర్మాణం కోసం ఏమీ చేయలేదని చెప్పారు.
కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..