(AP Employees protest) విజయవాడ : దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే చాలా సార్లు తమ సమస్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విన్నవించినా ఫలితం లేకపోయినందున తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళనలకు వెళ్లాల్సి వస్తుందని ఉద్యోగులు అంటున్నారు. ప్రభుత్వం దృష్టికి ఇప్పటివరకు తమ న్యాయమైన 71 డిమాండ్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. పీఆర్సీ ఇస్తామంటూ తాత్సారం చేస్తున్నారే కానీ, ఉద్యోగులను ఆదుకోవడం లేదని వారు అంటున్నారు.
రేపటి నుంచి ఉద్యమాన్ని ప్రారంభించేందుకు ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఉద్యమాన్ని దశలవారీగా ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని జేఏసీలు సంయుక్త కార్యాచరణను సిద్దం చేసుకున్నాయి. మొదటిరోజున నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని, అన్ని జిల్లాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించి ఉద్యోగులను చైతన్యపరుచనున్నట్లు ఏపీ జేఏఈసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. రానున్న రోజుల్లో తమ ఆందోళనను తీవ్రతరం చేసి ప్రభుత్వానికి తామేంటో చూపుతామన్నారు.
ఈ ఆందోళనల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెననర్లు పాలుపంచుకోనున్నారని కృష్ణా జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఏ విద్యాసాగర్ తెలిపారు. అనేక నెలలుగా పెండింగ్‌లో ఉన్న డియర్నెస్ అలవెన్స్‌కు సంబంధించిన ఏడు విడతల పీఆర్సీ అమలుపై ఉద్యోగుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. తమ న్యాయబద్దమైన డిమాండ్ల సాధనకు ఇంతకంటే మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు.
కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..