Irumudi Movie | మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇరుముడి’. ఈ చిత్రం నుంచి కథానాయికను పరిచయం చేశారు మేకర్స్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో హీరోయిన్గా ప్రియా భవానీ శంకర్ నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ను విడుదల చేసింది. ఇందులో ఆమె ‘కావేరి’ అనే పాత్రలో నటిస్తోంది. విడుదలైన పోస్టర్లో ప్రియా భవానీ శంకర్ ఎంతో సంప్రదాయబద్ధంగా ఉండగా.. రవితేజ ఆమెను ముద్దాడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆమె రవితేజకు భార్యగా, ఒక బాధ్యతాయుతమైన తల్లిగా ఎంతో హుందాతనమైన పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
రవితేజ కెరీర్లో 77వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో ఆయన ఒక అయ్యప్ప భక్తుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన రవితేజ ఫస్ట్ లుక్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, ఇప్పుడు హీరోయిన్ లుక్ కూడా తోడవడంతో సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ చుట్టూ ఈ కథ సాగనుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ మరియు విడుదల తేదీని ప్రకటించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Presenting the talented @priya_Bshankar as ‘Kaveri’ from #IRUMUDI / #ఇరుముడి – a caring wife and a doting mother ❤️
Starring MASS MAHARAJA @RaviTeja_offl 🤩
A @gvprakash musical 🎺🎼@ShivaNirvana @MythriOfficial @saikumaractor #BabyNakshathra #VishnuSharma @sahisuresh… pic.twitter.com/e9puiTkwrS
— Mythri Movie Makers (@MythriOfficial) February 15, 2026