CM Chandrababu | శ్రీశైలం : శ్రీశైలం మహా క్షేత్రానికి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీప్లేన్ ద్వారా చేరుకోనున్నారు. సీఎం రాక నేపథ్యంలో ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పరిశీలించారు. అందులో భాగంగా రోప్ వే ఎంట్రీ , పాతాళ గంగ బోటింగ్, ఆలయ ప్రాంగణంతో పాటు పలు ప్రదేశాలను పరిశీలించారు. ఏర్పాట్లు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశీలనలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌తో పాటు ఏఎస్ఎల్ బృందం, ఈవో చంద్రశేఖర్ రెడ్డి, డీఎస్పీ రామాంజి నాయక్, సీఐ ప్రసాద్ రావు, అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
AP Home Minister | మొసలి కన్నీరు కార్చడం మానండి.. జగన్‌కు ఏపీ హోంమంత్రి సూచన
YS Jagan | ఎలా మంత్రి అయ్యాడోనంటూ పవన్‌కల్యాణ్‌పై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు