(Maha Padayatra) నెల్లూరు : అమరావతి రైతుల మహా పాదయాత్ర ఇవాళ 36వ రోజుకు చేరింది. నెల్లూరు జిల్లా వెంగమాంబపురం నుంచి ఇవాల్టి పాదయాత్ర ప్రారంభమైంది. ఇవాల్టి యాత్ర వెంకటగిరి వరకు కొనసాగనున్నది. కాగా, ప్రముఖ పారిశ్రామిక వేత్త యార్లగడ్డ హరిశ్చంద్రప్రసాద్ రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. రైతులకు తన వంతు విరాళంగా రూ. 10లక్షలు అందజేశారు.
సోమవారం ఉదయం వెంగమాంబపురం నుంచి ప్రారంభమైన యాత్ర.. రాత్రికి వెంకటగిరి చేరుకోనుంది. ప్రచారరథంలోని వెంకటేశ్వరస్వామిని రైతు వేషధారణలో అలంకరించి పాదయాత్ర ప్రారంభించారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ మహనీయుడి ఆశయాలకు అనుగుణంగానే పాదయాత్ర సాగుతున్నా ప్రభుత్వం అడ్డుకుంటున్నదని రైతులు, అమరావతి జేఏసీ నేతలు ఆరోపించారు. ఈనెల 17న సభ నిర్వహణకు అనుమతి కోరుతూ పోలీసులకు లేఖ ఇవ్వగా.. అనుమతి నిరాకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంగమాంబపురం నుంచి పాదయాత్ర ప్రారంభం కాగానే.. రోడ్డు పక్కనే ఉన్న పొలంలో వరి నాట్లు వేస్తున్న రైతులు జై అమరావతి అంటూ నినదించారు. వరి నార్లు పట్టుకుని రైతులకు స్వాగతం పలికారు. ఇవాల్టి యాత్ర మాటమడుగు, బంగారుపల్లి మీదుగా కొనసాగనున్నది. బంగారుపల్లిలో మధ్యాహ్న భోజనం చేసిన రైతులు.. రాత్రికి వెంకటగిరిలో ఇవాల్టి యాత్రను ముంగించనున్నారు. ఇలా ఉండగా, పాదయాత్రలో నిబంధనలు అతిక్రమించారంటూ పోలీసులు 42 మందిపై కేసులు నమోదు చేసినట్లు అమరావతి జేఏసీ కన్వీనర్ శివారెడ్డి తెలిపారు.
కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..