(Covid @ AP) విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 156 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు కొవిడ్ బారినపడిన వారి సంఖ్య 20,66,875కి చేరుకున్నది. నిన్న ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఏపీలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 14,412 కి చేరుకున్నది.
గడిచిన 24 గంటల్లో నిన్న ఒక్కరోజు అనంతపురం 5, చిత్తూరు 34, తూర్పుగోదావరి 12, గుంటూరు 24, కడప 1, కృష్ణ 19, కర్నూలు 4, నెల్లూరు 13, ప్రకాశం 6, శ్రీకాకుళం 4, విశాఖపట్నం 11, విజయనగరం 3, పశ్చిమ గోదావరిలలో 20 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు. నిన్న కొవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 254 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,49,335కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 32,987 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,99,50,579 కి చేరుకున్నది. ప్రస్తుతం ఏపీలోని వివిధ దవాఖానల్లో 3,128 మంది చికిత్స పొందుతున్నారు.
చరిత్రలో ఈ రోజు : ఫ్రాన్స్‌లో ఉగ్రవాద దాడులకు ఆరేండ్లు..
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..