ఆదిలాబాద్ : ఆటోను ఆర్టీసీ బస్సు(RTC bus )ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్(Adilabad) జిల్లా బోథ్ మండలం పొచ్చర వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా చిట్యాలకు చెందిన ఏనుగు లక్ష్మారెడ్డి ఆటోలో తమ బంధువుల గ్రామం ధనోరకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బోథ్ నుంచి ఆదిలాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏనుగు లక్ష్మారెడ్డి అక్కడికక్కడే మరణించాడు. ఆటో డ్రైవర్‌తో పాటు మరొకరు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మారెడ్డి మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి.
ఇవి కూడా చదవండి..