Galikuntu | గాలికుంటు వ్యాధి నివారణకు పశువులకు టీకా తప్పనిసరి వేయించాలని పాడి రైతులకు కుభీర్ పశువైద్య అధికారి డాక్టర్ విశ్వజిత్ పటేల్ సూచించారు. బుధవారం నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని కస్ర, కస్ర తాండ గ్రామాలలో తెలంగాణ పశుసంవర్ధక శాఖ, కుభీర్ ప్రాథమిక పశువైద్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం గ్రామంలోని పశువులన్నింటికీ గాలికుంటు టీకాలను వేశారు.
అక్టోబర్ 15 నుండి నవంబర్ 14 శుక్రవారం వరకు నెలరోజుల పాటు మండలంలోని అన్ని గ్రామాలలో పశువులకు, 4 నెలలు దాటిన దూడలకు, గాలికుంటు వ్యాధి సోకకుండా నివారణ కోసం గాలికుంటు టీకాలు ఇస్తామని తెలిపారు. పాడి రైతులు పశువులకు టీకాలు వేయించుకోవాలని సూచించారు.
పశువులు ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆయా గ్రామాల్లోని రైతులకు పశువుల్లో పశువుల తరచూ వచ్చే వ్యాధులు వాటి నివారణపై అవగాహన కల్పించారు. సిబ్బంది పుప్పాల అవినాష్ తదితరులు ఉన్నారు.
Read Also :
OG | థియేటర్లలో ‘ఓజీ’ ఘన విజయం ..ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌పై స్పెషల్ ఫోకస్..!
Ed Sheeran | ఇంటర్నేషనల్ కోలాబరేషన్.. బ్రిటీష్ పాప్ సింగర్‌తో సంతోష్ నారాయణన్ ఇండియన్ ఆల్బమ్
Tanuj Mouli | రూ. కోటి అడ్వాన్స్.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భారీ ఆఫర్.