నిర్మల్ : నిర్మల్ జిల్లాలోని బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న భారీ వరద నీటితో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీగా వస్తున్న వరద కారణంగా గోదావరి పుష్కర ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి. ఆలయ సమీపంలోని పలు హోటల్లు, లాడ్జీల చుట్టూ వరద నీరు చేరింది. బాసర ఆలయం నుంచి గోదావరి నదికి వెళ్లే దారి పూర్తిగా నీట మునిగింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి..
Jayam Ravi | విడాకుల తర్వాత మరో షాక్.. జయం రవి ఇంటిని వేలం వేయనున్న బ్యాంక్
Pawan Kalyan | ఒకవైపు హిట్ అంటూ ఫ్యాన్స్ రచ్చ.. మరోవైపు ఓజీ డిజాస్టర్ అంటూ ట్రోలింగ్