Rakhi Celebrations | కుభీర్, ఆగస్టు 07: సోదరసోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సంబరాలను విద్యార్థులు ముందస్తుగా జరుపుకున్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థులు రాఖీ వేడుకలను జరుపుకున్నారు.
విద్యార్థులు తమ ఇంటి వద్ద నుండి స్వయంగా రాఖీలను తయారు చేసుకుని తీసుకువచ్చి.. విద్యార్థులకు విద్యార్థినిలు రాఖీలు కట్టి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా రాఖీ పండుగ విశిష్టతను గురించి హెచ్ఎం దంతుల సురేష్ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీ బాలేరావు గంగాధర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
COtton Crop | పత్తిలో అంతర పంటల సాగుతో చీడ పీడల నివారణ : శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ పల్లవి
Harish Rao | రెండేండ్ల కాంగ్రెస్ పాలన ప్రజలను కష్టాల పాలు చేసింది : హరీశ్ రావు
BRS | కార్యకర్తలకు బీఆర్ఎస్ పాటీ అండగా ఉంటుంది : వల్లుంపల్లి కరుణాకర్