లాహోర్: పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-8లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఓడిన అనంతరం పాకిస్థాన్ క్రికెటర్లకు స్వదేశంలో నిరసన సెగ తగులుతున్నది. ఈ మ్యాచ్‌లో ఓటమితో పాక్ సూపర్-8 ఆశలు దాదాపుగా ఆవిరయ్యాయి. దీంతో పాక్ క్రికెటర్లతో పాటు సారథి సల్మాన్ అలీ అఘా కుటుంబాలను టార్గెట్ చేస్తూ కొంతమంది నెటిజన్లు అభ్యంతకర పదజాలంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దిగారు.
అఘా, అతడి భార్య, కుమారుడిని దూషిస్తూ పోస్టులు పెట్టారు. దీనిపై అఘా భార్య సబ్బా మన్జెర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో స్పందిస్తూ.. ‘నన్ను, అమాయకుడైన నా కొడుకును తిట్టినంత మాత్రానా ప్రపంచకప్‌లో పాకిస్థాన్ టైటిల్ గెలువదు’ అని రాసుకొచ్చింది.