Students | కుభీర్, ఆగస్టు 07 : తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు పదో తరగతిలోనే బీజం పడాలని జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం సట్ల గంగాధర్ అన్నారు. గురువారం మండల కేంద్రం కుభీర్ లోని ప్రభుత్వ జడ్పీ హైస్కూల్లో పదోతరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. పదో తరగతి విద్యార్థుల జీవితాన్ని ఒక మలుపు తిప్పేందుకు తల్లిదండ్రులు తమ వంతు బాధ్యతగా పిల్లలను గైర్హాజర్ కాకుండా నిత్యం పాఠశాలకు పంపించాలని కోరారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించి పరీక్షలకు సన్నద్ధం చేస్తామని వివరించారు. మీ వంతు బాధ్యతగా పిల్లలకు పోషకాలతో కూడిన మంచి ఆహారం అందించడంతోపాటు వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు.
విద్యార్థి లక్ష్యంతో ముందుకెళ్లేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని పేర్కొన్నారు. పాఠశాలకు తమ పిల్లాడు వచ్చింది రానిది తమకు ఫోన్ చేసి తెలుసుకోవాలని సూచించారు. ఇక్కడ ప్రైవేట్‌కు ధీటుగా అన్ని సబ్జెక్టులకు బోధించే ఉపాధ్యాయులు ఉన్నారని.. చదువుల విషయంలో తమ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేస్తున్నది లేనిది గమనించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చదివిస్తే మునుముందు ఎన్నో లాభాలు ఉన్నాయని.. ఈ విషయాన్ని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తెలుసుకోవాలన్నారు.
విద్యార్థులకు క్రమశిక్షణతోపాటు గేమ్స్‌ను సాయంత్రం వేళలో కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. మీ వంతు బాధ్యతగా విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించి తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ వైశాలి, విద్యాభివృద్ధి కమిటీ సభ్యులు బోయిడి అభిషేక్, కందూరి చిన్న సాయినాథ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
COtton Crop | పత్తిలో అంతర పంటల సాగుతో చీడ పీడల నివారణ : శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ పల్లవి
Harish Rao | రెండేండ్ల కాంగ్రెస్ పాలన ప్రజలను కష్టాల పాలు చేసింది : హరీశ్ రావు
BRS | కార్యకర్తలకు బీఆర్ఎస్ పాటీ అండగా ఉంటుంది : వల్లుంపల్లి కరుణాకర్