Voter list | కుభీర్, ఆగస్టు 30: కుభీర్ మండల కేంద్రంతోపాటు మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జీపీ కార్యాలయాల్లో ప్రదర్శించిన ఓటరు జాబితాలు తప్పుల తడకగా ఉన్నాయని సెప్టెంబర్ 2 వరకు సవరించుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువును సెప్టెంబర్ 10వ తేదీ వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మండలాధ్యక్షుడు ఎన్నిల అనిల్, ఉద్యమకారుడు, మండల పార్టీ సీనియర్ నాయకుడు పుప్పాల పీరాజీ, టౌన్ అధ్యక్షుడు గిరి పోశెట్టిలు శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సాగర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో అనేక తప్పులు దొర్లాయని.. మరణించిన వారి పేర్లను తొలగించకపోవడంతోపాటు ఒక వార్డులోని కుటుంబ సభ్యుల పేర్లు వేర్వేరు వార్డుల్లో నమోదయ్యాయని తెలిపారు. పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు వార్డు సభ్యులుగా పోటీలో నిలిపేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. హడావిడిగా జీపీలలో ఓటరు జాబితాలు ప్రదర్శింపజేసి దొంగ ఓట్లకు ఆస్కారం కల్పించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని విమర్శించారు.
ఒక వార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరినీ అదే వార్డులో చేర్పించాలని ఈ విషయంలో అధికారులు రెండు రోజుల్లో ఈ ప్రక్రియ సాధ్యమవుతుందని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రెండేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఊరిస్తూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను దొడ్డి దారిన కైవసం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యూహాత్మకంగానే ఈ జాబితాలో ఇలా తప్పుడు తడకలుగా తయారు చేసిందని పేర్కొన్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ చొరవ చూపి ఓటర్ జాబితాలో తప్పులను సవరించేందుకు మరో పది రోజులు గడువు పెంచేందుకు చర్యలు చేపట్టాలని వారు కోరారు.
Harish Rao | పెట్రోల్‌కు రేవంత్ డబ్బులు ఇస్తున్నాడా..? పోలీసులకు హరీశ్‌రావు సూటి ప్రశ్న
పార్టీ మారితేనే సహకారం.. లేదంటే తిరస్కారం..