Komatireddy Rajagopal Reddy | ఇవాళ అసెంబ్లీ ప్రారంభం కాబట్టి వచ్చా.. రేపట్నుంచి రాను.. రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Komatireddy Rajagopal Reddy | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సభ ప్రారంభం కాబట్టి అసెంబ్లీకి వచ్చానని.. రేపటి నుంచి రానని తెలిపారు.
Komatireddy Rajagopal Reddy | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సభ ప్రారంభం కాబట్టి అసెంబ్లీకి వచ్చానని.. రేపటి నుంచి రానని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన.. గన్‌పార్క్ వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ… ప్రజలు వరద కష్టాల్లో ఉన్నారని.. వారికి అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. వరద సమయంలో మనం ఉండాల్సింది ప్రజల్లో కానీ అసెంబ్లీలో కాదని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ప్రజల్లో ఉండి, వారి కష్టాలు తీర్చడమే తన లక్ష్యమని చెప్పారు.
కామారెడ్డి ప్రాంతంలో వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తన అనుచరులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించి వారికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అందువల్లే తాను అసెంబ్లీకి మళ్లీ రానని వివరించారు. ఇక మంత్రి పదవిపైనా రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరికైనా సరే పదవి శాశ్వతం కాదని అన్నారు. మంచి వ్యక్తిత్వం, సేవ చేయాలనే గుణమే శాశ్వతమని పేర్కొన్నారు. సేవాగుణం చచ్చేవరకూ ఉంటుందని.. కానీ పదవి మాత్రం ఉండదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా కాకుండా ఒక వ్యక్తిగా సహాయం చేస్తానని ప్రకటించారు. ప్రభుత్వమే అన్నీ చేయాలని అనుకుంటే సాధ్యం కాదు కదా అంటూ వ్యాఖ్యానించారు.
మరోవైపు అసెంబ్లీ వద్ద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు బల ప్రదర్శనకు దిగారు. తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలంటూ నిరసనకు దిగారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

