కడెం, ఏప్రిల్ 2: మండలంలోని పెద్దూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం రాత్రి పాఠశాల గదుల తాళాలు పగలగొట్టి చోరీకి యత్నంచినట్లు ఎస్ఐ కృష్ణసాగర్రెడ్డి తెలిపారు. అయితే మంగళవారం రాత్రి తాళాలు పగలగొట్టిన దుండగులు పాఠశాలలో ఎలాంటి వస్తువులు దొరకకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయినట్లు తెలిపారు. గత మూడు రోజులుగా వరుసగా సెలవులు ఉండడంతో దుండగులు ఈ చోరీకి యత్నించినట్లు తెలిసింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భూమేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Anasuya | హార్ట్ బ్రేకింగ్ అంటూ అనసూయ పోస్ట్..దేని గురించి అంటే..!
Samantha – HCU Issue | హెచ్‌సీయూ వివాదంపై స్పందించిన సమంత
Aishwarya-Abhishek | విడాకుల రూమర్స్ వేళ.. స్టేజ్‌పై డ్యాన్స్‌తో ఆకట్టుకున్న ఐశ్వర్య – అభిషేక్ జంట