Anasuya | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వివాదం ఎంత చర్చనీయాంశంగా మారుతుందో మనం చూస్తూనే ఉన్నాం. 400 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించడంతో దీనికి వ్యతిరేఖంగా హెచ్ సి యు విద్యార్థులు గత కొన్ని రోజులుగా నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల అరెస్ట్ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. విద్యార్ధులకి పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సైతం సపోర్ట్ అందిస్తున్నారు. కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందిస్తూ..ఐటీ పార్క్ కోసం 400 ఎకరాల చెట్లని ధ్వంసం చేయడం ఎందుకు .. డెవలప్ చేయాలి అంటే చెట్లు లేని భూములు చాలా ఉన్నాయి కదా అని నాగ్ అశ్విన్ ఇటీవల ప్రశ్నించారు.
రేణూ దేశాయ్ కూడా చాలా ఎమోషనల్‌గా దీనిపై స్పందించింది. ఐటీ పార్కులు, ఆకాశాన్ని తాకే భవనాలు అన్నీ అవసరమే. కానీ కుదిరితే ఈ ఒక్క 400 ఎకరాలు వదిలేయండి. తెలంగాణ సిటిజన్ గా నేను వేడుకుంటున్నా. దయచేసి ఏదో విధంగా దీనిని ఆపండి సార్. ఒక తల్లిగా మాత్రమే నేను రిక్వస్ట్ చేస్తున్నా. ఆ 400 ఎకరాల్లో విధ్వంసం వద్దు అని రేణు దేశాయ్ వేడుకున్నారు. రష్మీ, ప్రకాశ్ రాజ్ ఇలా పలువురు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పుడు ఇదే లిస్ట్‌లో అనసూయ కూడా చేరింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేస్తూ.. ఇది నిజంగా హార్ట్ బ్రేకింగ్ అంటూ రాసుకొచ్చింది. పచ్చని అడివి పూడ్చివేసే రోజు వచ్చింది. ఎరుపు రంగులో ఉన్న చెట్లు నేలకూలాయి అంటూ కామెంట్ పెట్టింది. ఇలా అనసూయ కూడా హెచ్‌సీయూ వివాదంపై తన సపోర్ట్ తెలియజేసింది.
ఇక రేవంత్ రెడ్డి సర్కార్‌పై హెచ్‌సీయూ విద్యార్థులు పోరుబాట కొనసాగుతూనే ఉంది. జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఉదయమే హెచ్‌సీయూ క్యాంపస్‌ను వేలాది మంది పోలీసులు చుట్టుముట్టి బారికేడ్లు ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ లోపలికి బయటి వ్యక్తులను రానివ్వకుండా, విద్యార్థులను బయటకు రానివ్వకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రొఫెసర్లు, విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. పోలీసుల తీరుపై విద్యార్థులు, ప్రొఫెసర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.