Samantha Reacts on HCU Issue | కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద గత రెండు రోజులుగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిధిలోని 400 ఎకరాల భూముల్లో పర్యావరణ విధ్వంసానికి తెగబడుతున్న రేవంత్ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కంచ గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికే ఈ విధ్వంసంపై పలువురు రాజకీయ నాయుకులతో పాటు సినీ ప్రముఖులు స్పందించారు. మరోవైపు కంచ గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగగా.. వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
అయితే తాజాగా ఈ వివాదంపై టాలీవుడ్ నటి సమంత ఇన్‌స్టా వేదికగా స్పందించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల కథనంపై ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తెలంగాణ టుడే(Telangana today)లో వచ్చిన ఆర్టికల్‌ని పోస్ట్ చేసిన సమంత.. కంచ గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ నినాదం ఇచ్చింది. ఈ సందర్భంగా ఆన్లైన్ వేదికగా Change.org (సామాజిక సమస్యలపై ప్రశ్నించే సంస్థ) పిటిషన్‌కి సైన్ చేయాలని కోరింది.
హెచ్‌సీయూ వివాదంపై స్పందించిన సమంత pic.twitter.com/Q0ogTSBXTX
— Namasthe Telangana (@ntdailyonline) April 2, 2025
కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్, పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్, విరాట పర్వం దర్శకుడు వేణు ఉడుగుల, యాంకర్ రష్మీ గౌతమ్, ఈషా రెబ్బా, ప్రియదర్శి తదితరులు కూడా ఈ విషయంపై స్పందించారు.