ఆదిలాబాద్ : ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరమని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం నేరడిగొండలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. తాంసి మండలంలోని బండల్ నాగపూర్ గ్రామానికి చెందిన పోతం కృష్ణవేణికి మంజూరు అయిన రూ. 12,000, బోథ్ మండల కేంద్రానికి చెందిన ఈశ్వరి కసరంకుమంజూరు అయిన రూ. 22,500 ల సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం నెరడిగొండ మండల కేంద్రంలో అందజేశారు. ఆయన వెంట వెంకట్ రెడ్డి, సోను, ప్రతాప్, గులాబ్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Theme Of Gajapathi | ప్రతీ బీట్‌లో రాజసం, క్రూరత్వం.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా భైరవం థీమ్ ఆఫ్ గజపతి
Chattishgarh | ఎదురు కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు హతం..!
Amir Hamza | ప్రాణాపాయ స్థితిలో లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు