Theme Of Gajapathi | బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) నారా రోహిత్ (Nara Rohith), మంచు మనోజ్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం భైరవం (Bhairavam). ఉగ్రం ఫేం విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ భామ అదితీశంకర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. భైరవం మే 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
కాగా ఈ మూవీ నుంచి మంచు మనోజ్ రోల్‌ను ఎలివేట్ చేస్తూ విడుదల చేసిన థీమ్ ఆఫ్ గజపతి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. థీమ్ ఆఫ్ గజపతి విడుదలైన కొన్ని గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ దాటి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. తాజా వార్త సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది.
అమ్మవారి గుడిని కాపాడే నేపథ్యంలో..
భైరవం టీజర్లో.. రాత్రి నాకొక కల వచ్చింది. చుట్టు తెగిపడిన తలలు, మొండాలు.. దూరంగా మృత్యువు తెలియని జయించిన కృష్ణుడిలా శంఖం పూరించుకుని వెళ్లిపోతున్న శ్రీను.. ఈ ఊరిని కాపాడటానికి వారాహి అమ్మవారు.. ఆ అమ్మగుడిని కాపాడటానికి నానమ్మ ఉండగా నాకేమవుతుందమ్మా అంటూ సాగుతున్న సన్నివేశాలు.. అమ్మవారి గుడిని కాపాడే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేస్తున్నాయి.
ఇక మనోజ్ శ్రీనుగాడి కోసం నా ప్రాణాలిస్తా.. వాడి జోలికెవడైనా వస్తే కొడకా ప్రాణాలు తీస్తానంటూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాడు. ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
ROYAL & RUTHLESS in every beat 💥💥#ThemeOfGajapathi from #Bhairavam hits 1 MILLION+ VIEWS ❤️🔥
▶️ https://t.co/jjbEJz8eSF#BHAIRAVAM IN CINEMAS WORLDWIDE ON MAY 30th 🔱@BSaiSreenivas ‘Rocking Star’ @HeroManoj1 @IamRohithNara @DirVijayK @AditiShankarofl @anandhiactress… pic.twitter.com/XBsa5TFqnG— BA Raju’s Team (@baraju_SuperHit) May 21, 2025
థీమ్ ఆఫ్ గజపతి..
Raashi Khanna | సినిమాలంటే ఆసక్తి లేదట.. తన రూంమేట్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన రాశీఖన్నా
Ruchi Gujjar | మోదీ నెక్లెస్‌తో కేన్స్‌లో సందడి చేసిన బాలీవుడ్ భామ.. అందరి చూపు ఆమె వైపే
Thug life | ముంబైలో కమల్‌హాసన్, శింబు థగ్‌లైఫ్ టీం.. ట్రెండింగ్‌లో స్టిల్స్