Thug life | ఉలగనాయగన్ కమల్‌హాసన్ (Kamal haasan) లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం థగ్ లైఫ్ (Thug life). లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంపౌండ్ నుంచి వస్తోన్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు కీలక పాత్రలో నటిస్తుండగా.. ఐశ్వర్యలక్ష్మి, త్రిష, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. యాక్షన్ డ్రామా ఎలిమెంట్స్, ఇంటెన్స్ ఎమోషన్స్‌తో సాగుతున్న ట్రైలర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం జూన్ 5న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మే 24న గ్రాండ్ మ్యూజికల్ కాన్సర్ట్‌లో ఆడియో ఆల్బమ్‌ను విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా ఉలగనాయగన్ టీం ముంబైలో ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా దిగిన స్టిల్స్‌తోపాటు ప్రమోషనల్ ఈవెంట్స్ ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
థగ్ లైఫ్ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని కమల్ హాసన్-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్-ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
కమల్‌హాసన్, త్రిష టీం ఇలా..
Power-packed launch of #ThuglifeTrailer in Mumbai#ThuglifeAudioLaunch from May 24#ThuglifeTrailer
➡https://t.co/8FQ0g5OaaW#Thuglife #ThuglifeFromJune5 #KamalHaasan #SilambarasanTR #IMAXA #ManiRatnam Film
An @arrahman Musical@ikamalhaasan @SilambarasanTR_ #Mahendran… pic.twitter.com/cJNEMNQ1Tm— Madras Talkies (@MadrasTalkies_) May 20, 2025
LOCKED, LOADED & LANDED
The THUGS are in Mumbai for the trailer launch at 7 PM today #PVRJuhu#ThuglifeAudioLaunch from May 24
ThuglifeTrailer
➡https://t.co/8FQ0g5OaaW#Thuglife#ThuglifeFromJune5 #KamalHaasan #SilambarasanTR #IMAXA #ManiRatnam Film
An @arrahman Musical… pic.twitter.com/lTDY3lf1Ij— Madras Talkies (@MadrasTalkies_) May 20, 2025
Raashi Khanna | సినిమాలంటే ఆసక్తి లేదట.. తన రూంమేట్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన రాశీఖన్నా
Ruchi Gujjar | మోదీ నెక్లెస్‌తో కేన్స్‌లో సందడి చేసిన బాలీవుడ్ భామ.. అందరి చూపు ఆమె వైపే