Raashi Khanna | నార్త్ నుంచి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న భామల్లో టాప్‌లో ఉంటుంది రాశీఖన్నా (Raashi Khanna). తెలుగులో లీడింగ్ హీరోలతో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తన క్లోజ్ ఫ్రెండ్ బాలీవుడ్ నటి వాణీ కపూర్ గురించి గతంలో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూల్లో ఇప్పటికే పలు విషయాలు షేర్ చేసుకుందని తెలిసిందే.
అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన లైఫ్, కెరీర్, వాణీ కపూర్‌తో స్నేహం గురించి ఆసక్తికర విషయం షేర్ చేసింది. తాను న్యూఢిల్లీలో చదువుతున్నప్పుడు మోడలింగ్‌ను హాబీగా పెట్టుకున్నానని.. ఓ మోడలింగ్ ఈవెంట్లో వాణీ కపూర్‌ను తొలిసారి కలుసుకున్నానని చెప్పింది రాశీఖన్నా.
‘ వాణీకపూర్‌ను నా మోడలింగ్ ఏజెన్సీలో చేర్పించాను. వాణీకపూర్ ఎప్పుడూ యాక్టర్ కావాలనుకునేది. తాను ముంబైకి మారినప్పుడు నన్ను కూడా అక్కడ (ముంబై)కు వెళ్లేలా ప్రోత్సహించింది. ముంబైలో మేమిద్దరం రూంమేంట్స్. మేము ప్రాణ స్నేహితులల్లాంటి వాళ్లం. హీరోయిన్లు స్నేహితులుగా ఉండలేరనే ఆలోచన అంతా అబద్ధం. ఇన్‌స్టాగ్రామ్‌లో మా స్నేహం గురించి పబ్లిసిటీ చేయకపోవడం వల్ల కొందరికి అలా అనిపిస్తుందని అనుకుంటున్నానంది’.
సినిమాలంటే అంతగా ఆసక్తి లేదన్న రాశీఖన్నా మద్రాస్ కేఫ్‌లో నటించే అవకాశమొస్తే రెండు సార్లు తిరస్కరించానని కూడా చెప్పింది. ‘ఈ చిత్రంలో జాన్ అబ్రహాం ఉన్నాడు.. సూజిత్ సర్కార్ దర్శకుడు. వాళ్లు నన్ను మద్రాస్ కేఫ్ సినిమా కోసం మూడోసారి పిలిచినప్పుడు నేను కలిసేందుకు ఓకే అన్నానంటూ‘ చెప్పుకొచ్చింది. మొత్తానికి రాశీఖన్నా అలా 2013లో మద్రాస్ కేఫ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ డెబ్యూ ఇచ్చిందన్నమాట.