Ruchi Gujjar | కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో అందాల ముద్దుగుమ్మలు వెరైటీ డ్రెస్సులలో కనిపిస్తూ తెగ సందడి చేస్తున్నారు. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ధరించి అందరి దృష్టిపై తమపై ఉండేలా చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ కి చెందిన నటి రుచి గుజ్జర్ మోదీ నెక్లెస్ ధరించి అందరి దృష్టి తనపై పడేలా చేసింది. కేన్స్ ఫెస్టివల్‌కి హాజరైన అందరికి స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేయగా, ఆ కార్యక్రమానికి రుచి గజ్జర్ లెహంగా వేసుకొని మెడలో మోదీ నెక్లెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. తన నెక్లెస్ కి బీజేపీ గుర్తు అయిన కమలం పువ్వులో మోదీ ఫొటోలు ఉన్న లాకెట్స్ తగించుకొని రుచి గజ్జర్ రావడం చర్చనీయాంశం అయింది.
రుచి వేసుకొచ్చిన ఈ లెహంగా, నెక్లెస్లని రూప శర్మ డిజైన్ చేసినట్టు సమాచారం. ఈ మోదీ నెక్లెస్ గురించి రుచి గుజ్జర్ మాట్లాడుతూ.. ఈ డ్రెస్ మా రాజస్థానీ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వేసుకున్నాను. ఇక నెక్లెస్ విషయానికి వస్తే ఇది కేవలం జ్వువెలరీ కాదు. ధైర్యం, ముందు చూపు, భారత్ ప్రపంచ వేదికలపై ముందుకు వెళుతుందని గుర్తు. కేన్స్‌లో ఇలా వేసుకోవడం నా ప్రధాన మంత్రికి గౌరవం ఇవ్వడం కోసం. ఆయన నేతృత్వంలో ఇండియా కొత్త తీరాలకి వెళుతుంది అని పేర్కొంది. ఏది ఏమైన రుచి గజ్జర్ ఒక్క మోదీ నెక్లెస్‌తో కేన్స్‌లో ప్రకంపనలు పుట్టించింది అని చెప్పాలి. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అంటే ఫ్యాషన్ కి అడ్డా. అక్కడికి వచ్చే వాళ్లంతా కొత్త రకం డ్రెస్సులతో అలరిస్తారు. ఇక్కడ పలు సినిమాలు స్క్రీనింగ్ కూడా జరుపుకుంటాయి.
ఇక రుచి గజ్జర్ విషయానికి వస్తే.. ఈమె రాజస్థాన్ కి చెందిన అమ్మాయి. జైపూర్ లో కాలేజీ పూర్తి చేసి ఆ తర్వాత మోడలింగ్ రంగంవైపుకు వెళ్ళింది. 2023 లో మిస్ హర్యానా గా నిలిచిన ఈ అమ్మడు ఆ తర్వాత మోడలింగ్ చేస్తూ బాలీవుడ్ లో పలు ప్రైవేట్ వీడియో సాంగ్స్ చేసింది. అలా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని బాలీవుడ్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తుంది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఈ భామ ఒక్కసారిగా మోదీ నెక్లెస్ తో అందరి కంట్లో పడింది. మరి ఇప్పటికైన రుచి గుజ్జర్ కి బాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తాయేమో చూడాలి.