Amir Hamza | పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు (Lashkar co founder ) అమీర్ హమ్జా (Amir Hamza) ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలిసింది. లాహోర్ (Lahore)లోని తన నివాసంలో జరిగిన ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడినట్లు (critically injured) సమాచారం. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
లష్కరే తోయిబా 17 మంది వ్యవస్థాపక సభ్యుల్లో హమ్జా ఒకరు. అతను తన ఇంటి లోపల జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ.. ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే నివేదించింది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడయాలో అతనిపై కాల్పులు జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ, ఆ ఊహాగానాలన్నీ అబద్ధమని దర్యాప్తులో తేలింది.
లష్కరే తోయిబాలో కీలక వ్యక్తి
లష్కరే తోయిబాలో అమీర్ హమ్జా కీలక వ్యక్తి. నిధుల సేకరణ, రిక్రూట్ మెంట్ వంటి అంశాల్లో కీలకంగా వ్యవహరించాడు. లష్కరే కేంద్ర సలహా కమిటీ సభ్యుడిగా, హఫీజ్ సయీద్ నాయకత్వంలోని ఇతర ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలను మెరుగుపరచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2018లో లష్కరే తోయిబా అనుబంధ స్వచ్ఛంద సంస్థలైన జమాత్-ఉద్-దవా, ఫలాహ్-ఎ-ఇన్సానియత్ ఫౌండేషన్లపై పాకిస్థాన్ అధికారులు ఆర్థికంగా ఆంక్షలు విధించిన తర్వాత హమ్జా లష్కరేని వీడాడు. ఆ తర్వాత జైషే మన్ ఖఫా అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు.
Also Read..
Dr. Jayant Narlikar | ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ నార్లికర్ ఇకలేరు
Devanand | ఐసీయూ నుంచి.. ఐఎఫ్ఎస్ అధికారిగా