Golden Dome: 175 బిలియన్ల డాలర్లతో క్షిపణి రక్షణ వ్యవస్థ.. ‘గోల్డెన్ డోమ్’ ప్లాన్ ప్రకటించిన ట్రంప్
Golden Dome: రష్యా, చైనా దేశాలు మిస్సైల్ టెక్నాలజీలో దూసుకెళ్తున్నాయి. ఆ దేశాలు దాడి చేస్తే అమెరికా పరిస్థితేంటి? ఈ నేపథ్యంలో గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 175 బిలియన్ల డాలర్ల ఖర్చుతో ఆ క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందించనున్నారు.
న్యూయార్క్ : భవిష్యత్తు రాబోయే యుద్ధాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా సమాయత్తమవుతున్నది. ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇవాళ భారీ ప్రకటన చేశారు. ఇజ్రాయిల్‌లోని ఐరన్ డోమ్ తరహాలో.. అమెరికాకు గోల్డన్ డ్రోమ్(Golden Dome)ను రూపొందించనున్నట్లు చెప్పారు. సుమారు 175 బిలియన్ల డాలర్ల ఖర్చుతో ఆ డోమ్‌ను నిర్మించనున్నారు. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, ఇతర వైమానిక దాడుల నుంచి అమెరికాను కాపాడుకునేందుకు గోల్డన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందించనున్నట్లు ట్రంప్ చెప్పారు. గోల్డన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ తన పదవీ కాలం ముగిసేలోగా వినియోగంలోకి వస్తుందన్నారు.
రాబోయే రోజుల్లో అమెరికాకు వైమానిక దాడుల నుంచి ప్రమాదం పొంచి ఉందని, ముఖ్యంగా బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో ఓ కొత్త ప్లాన్‌ను ప్రకటిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. గోల్డన్ డోమ్ కోసం ఈ సారి బడ్జెట్లో 25 బిలియన్ల డాలర్లు కేటాయించినట్లు చెప్పారు. మునుముందు ఆ డోమ్ కోసం భారీగా ఖర్చు చేసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అత్యాధునిక ఆయుధాలు శత్రువుల వద్ద ఉన్నాయని, దానికి తగినట్లు రక్షణ వ్యవస్థను తయారు చేసుకోవాలన్నారు.
గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు నిర్మాణ పనులను స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లెన్కు అప్పగించారు. స్పేస్ ఫోర్స్‌లో ప్రస్తుతం ఆయన స్పేస్ ఆపరేషన్స్ వైస్ చీఫ్‌గా ఉన్నారు. ఏరియల్ దాడుల్ని అడ్డుకునేందుకు కావాల్సిన వ్యవస్థను రూపొందించాలని, దానికి కావాల్సిన ప్రణాళికలను తయారు చేయాలని ట్రంప్ ఇటీవల రక్షణ శాఖను ఆదేశించారు. దాని ప్రకారమే గోల్డెన్ డోమ్ కాన్సెప్ట్‌ను డెవలప్ చేశారు.
వైట్‌హౌజ్‌లోని ఓవల్ ఆఫీసులో ట్రంప్ మాట్లాడుతూ.. భూమి, ఆకాశం, నీటి యుద్ధాల్లో వాడే టెక్నాలజీ ఆయుధాలను ఎదుర్కొనే రీతిలో మిస్సైల్ రక్షణ వ్యవస్థ పనిచేయనున్నట్లు తెలిపారు. అంతరిక్ష ఆధారిత సెన్సార్లు, ఇంటర్సెప్టార్లను కూడా తయారు చేయనున్నారు. గోల్డెన్ డోమ్ రూపకల్పన కోసం కెనడాను కూడా భాగస్వామ్యం కావాలని కోరినట్లు ట్రంప్ వెల్లడించారు. డోమ్ ప్రాజెక్టులో తాము కూడా ఆసక్తిగా ఉన్నట్లు ఇటీవల ఆ దేశ రక్షణ శాఖ మంత్రి బిల్ బ్లెయిర్ తెలిపారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అది కీలకమైందన్నారు.
గోల్డెన్ డోమ్ పని తీరు గురించి వివరిస్తూ.. ఇతర ప్రపంచ దేశాల నుంచి ప్రయోగించిన క్షిపణులను కూడా ఆ వ్యవస్థ అడ్డుకోగలదని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌కు చెందిన ఐరన్ డోమ్‌ను ప్రేరణగా తీసుకుని దీన్ని డెవలప్ చేస్తున్నట్లు చెప్పారు. రాకెట్లు, మిస్సైళ్లను తిప్పికొట్టేందుకు ఇజ్రాయిల్ 2011 నుంచి ఐరన్ డోమ్‌ను వాడుతున్నది.
అయితే గోల్డెన్ డోమ్‌ను అత్యంత భారీ సైజులో నిర్మించనున్నారు. వివిధ రకాల దాడుల్ని తిప్పికొట్టే రీతిలో దాన్ని తయారు చేయనున్నారు. ధ్వని వేగం కన్నా అధిక వేగంతో ప్రయాణించే హైపర్సోనిక్ మిస్సైళ్లను కూడా అడ్డుకునే రీతిలో గోల్డెన్ డోమ్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆకాశంలోనే శత్రువు ఆయుధాలను చిత్తు చేయనున్నట్లు చెప్పారు. డోమ్ సక్సెస్ రేటు 100 శాతం ఉంటుందన్నారు.
మిస్సైళ్లను లాంచ్ చేసే సమయంలోనైనా, లేదా అవి మార్గమధ్యంలో ఉన్న సమయంలోనైనా.. వాటిని అడ్డుకునే రీతిలో గోల్డెన్ డోమ్ పనిచేస్తుందని అమెరికా అధికారులు చెబుతున్నారు. చాలా రకాల వ్యవస్థలన్నీ.. ఒక సెంట్రలైడ్జ్ కమాండ్ కింద పనిచేస్తాయని రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాబోయే 20 ఏళ్లలో ఆ డోమ్ కోసం సుమారు 542 బిలియన్ల డాలర్లు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి.
రష్యా, చైనా దేశాలు మిస్సైల్ టెక్నాలజీలో దూసుకెళ్తున్నాయని, అయితే ప్రస్తుతం ఉన్న వ్యవస్థలు ఆ టెక్నాలజీని ఢీకొట్టే రీతిలో లేవని, దాని కోసమే గోల్డెన్ డోమ్‌ను రూపొందిస్తున్నట్లు పెంటగాన్ అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

