కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని సోమగూడెం గ్రామంలో బుధవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లి బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. సోమగూడెంతో పాటు చుట్టు పక్కల గ్రామాల మహిళలు భారీగా తరలి వచ్చారు. గ్రామంలో డప్పుచప్పుల్లు, నృత్యాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొరికొప్పుల ప్రమీలా గౌడ్, రాజ్య లక్ష్మి, వెంకట లక్ష్మి, కొయ్యాడ శ్రీనివాస్, తోడేటి ప్రశాంత్, రామా గౌడ్, మహిళలు భారీగా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Monsoon Session | మూడో రోజూ దద్దరిల్లిన ఉభయసభలు.. ఎలాంటి చర్చా లేకుండానే రేపటికి వాయిదా